: మంత్రివర్గ సమావేశం ప్రారంభం


సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఇద్దరు తెలంగాణప్రాంత మంత్రులు, ఆరుగురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు సమావేశానికి గైర్హాజరయ్యారు. రాజీనామాలు సమర్పించిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా హాజరుకాలేదు. కాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన గీతారెడ్డి, దానం నాగేందర్ కూడా గైర్హాజరయ్యారు. తెలంగాణ విభజన ప్రకటన తరువాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనిపై పలువురు మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలువురు తెలంగాణ మంత్రులు హాజరవుతుండడంతో సమావేశం జరిగే తీరు ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు.

  • Loading...

More Telugu News