: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరెస్టు


అసెంబ్లీ వద్ద ధర్నా చేసేందుకు ర్యాలీగా బయల్దేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలంటూ వైఎస్సార్సీపీ శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వారు తెలుగుతల్లి విగ్రహం నుంచి ర్యాలీగా బయల్దేరారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News