: పదవీ కాలంలో సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యాను: పోప్


పోప్ బాధ్యతల నుంచి వైదొలగనున్న బెనడిక్ట్-16 తన అంతరంగాన్ని బయటపెట్టారు. పదవీకాలంలో ఎన్నో సమస్యలతో సతమతమయ్యానని వెల్లడించారు. కొన్నిసార్లు మొర ఆలకించకుండా 'దేవుడు నిద్ర పోతున్నాడా?' అన్నంతగా కష్టాలు చుట్టుముట్టాయని ఆయన చెప్పారు. అధికారిక హోదాలో చివరి సారి ప్రజలకు దర్శనమిచ్చిన పోప్ వారినుద్ధేశించి మాట్లాడారు.

ఎనిమిదేళ్ల పదవీకాలంలో ఎందరో సహకరించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోప్ పదవికి వీడ్కోలు పలికినా, కుటుంబం కోసం కాకుండా మతపరమైన యాత్రలు, సమ్మేళనాలు, సమావేశాలకు హాజరవుతుంటానని ఆయన అన్నారు. పోప్ ఎప్పుడూ ఒంటరి వాడు కాదంటూ, మద్దతుగా ప్రజలు నిలుస్తారని చెప్పారు. కాగా, పోప్ ప్రసంగం సాగుతున్నంతసేపూ ప్రజల కరతాళ ధ్వనులతో పీటర్ స్క్వేర్ మార్మోగిపోయింది

  • Loading...

More Telugu News