: ఆర్ బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నేడే


కొత్త ఆర్ బీఐ గవర్నర్ సారధ్యంలో ఈ రోజు ద్రవ్య పరపతి సమీక్ష (మానిటరీ పాలసీ) వెలువడనుంది. ఆర్థిక వ్యవస్థ డీలా పడిన సమయంలో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గా రఘురాం రాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత... పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. డాలర్ మారకంతో చితికిపోయిన రూపాయికి జవసత్వాలు వచ్చి కొంత వరకు పుంజుకుంది. అలాగే స్టాక్ మార్కెట్లు కూడా లాభాలబాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు వెలువడనున్న మానిటరీ పాలసీ మన ఆర్థిక వ్యవస్థకే కాకుండా, వ్యక్తిగతంగా రాజన్ కు కూడా అత్యంత కీలకం కానుంది.

ఆగస్టులో ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని రాజన్ అడుగులు వేయాల్సి ఉంటుంది. దీనికి తోడు కీలక రేట్లలో కోత విధించాలంటూ అన్ని వర్గాల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నిన్న అమెరికా ఫెడ్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీలను కొనసాగిస్తామని ప్రకటించడంతో... రాజన్ కు కొంత అనుకూలత ఏర్పడింది.

  • Loading...

More Telugu News