: డీజీపీని కాకముందే నన్ను టార్గెట్ చేశారు: దినేశ్ రెడ్డి


తాను రాష్ట్ర డీజీపీ పదవి చేపట్టకముందే తనను కొందరు లక్ష్యంగా చేసుకున్నారని పోలీస్ బాస్ దినేశ్ రెడ్డి అంటున్నారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను పోలీస్ చీఫ్ గా రాకముందే తనపై హోం మంత్రికి ఫిర్యాదులు పంపారని వెల్లడించారు. అయితే, వాటిలో ఫిర్యాదుదారుడి పేరు లేకపోవడంతో హోం శాఖ వాటిని పక్కనబెట్టిందని తెలిపారు. డీజీపీ పదవి తనకు దక్కకుండా చేసేందుకు కొన్ని పిటిషన్ లు కూడా వేశారని, ఆ పిటిషన్లలో వాస్తవాలు ఏవీ ఉండవన్న సంగతి వారికీ తెలుసన్నారు. ఇటీవలే ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేసి మళ్ళీ తనపై కేసు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News