: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో భత్కల్ ఐదో నిందితుడు
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను ఏన్ఐఏ ఐదవ నిందితునిగా పేర్కొంది. అటు ఇదే కేసులో మరో నిందితుడు ఉగ్రవాది అసదుల్లా అక్తర్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.