: హెలికాప్టర్ల స్కాంలో సీబీఐ దర్యాప్తుకు బీజేపీ డిమాండు
'అగస్టా వెస్ట్ లాండ్' హెలికాప్టర్ల స్కాంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని బీజేపీ డిమాండు చేసింది. రాజ్యసభలో ఈ రోజు హెలి
ఇటలీ దర్యాపులో గత ఏడాది జులైలోనే భారతీయుల పేర్లు వెల్లడయ్యాయన్నారు. ఇదే సమయంలో, ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిత్వ శాఖను అత్యంత అవినీతి గల శాఖ అంటూ ఆయన నింద మోపారు. స్కాంలపై సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందని డిమాండు చేశారు. అయితే ఇలాంటి కుంభకోణాలు బయటపడినప్పుడు కాంగ్రెస్ ముందుగా దర్యాప్తును మరింత జాప్యం చేస్తోందనీ, ఇతర పార్టీలను, బ్యూరో క్రాట్లను నిందితులుగా చూపుతోందని సభలో చెప్పారు. మరోవైపు హెలికాప్టర్ల అంశంపై జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటు చేయాలని సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఎంలు డిమాండు చేస్తున్నాయి.