: టుండాకి పోలీస్ కస్టడీ
భారత్, నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన బాంబు తయారీ నిపుణుడు అబ్దుల్ కరీమ్ టుండాకు ఢిల్లీ కోర్టు పదిరోజుల పోలీస్ కస్టడీ విధించింది. 1997 బాంబు పేలుళ్ళ కేసుకు సంబంధించి కోర్టు ఈ కస్టడీ విధించింది. ఢిల్లీ సదర్ బజార్ లో జరిగిన ఆనాటి పేలుళ్ళ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి.