: దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్, నవంబర్ నెలల్లో 104 ప్రత్యేక రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-గౌహతి, సికింద్రాబాద్-ముంబయి, హైదరాబాద్ - కోల్ కతా, కాచిగూడ-మంగుళూరు, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె ప్రకటించడంతో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా ప్రత్యేక రైళ్ళు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి.