: మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి మృతి
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి మృతి చెందారు. నిన్న కడపలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో... హుటాహుటీన ఆయనను తిరుపతి స్విమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. లక్కిరెడ్డిపాలెం మండలం రెడ్డివారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఐదుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. రెండు సార్లు మంత్రి పదవిని చేపట్టారు.