: మార్కెట్లోకి ఉగ్రవాది అఫ్జల్ గురు పుస్తకం
ఉగ్రవాది అఫ్జల్ గురు రచించిన ఓ పుస్తకం జమ్మూకాశ్మీర్ లో విడుదలైంది. అఫ్జల్ జైల్లో ఉన్న సమయంలో రాసిన డైరీని ఓ పుస్తకంగా ప్రింట్ చేయించి 'అహ్లె ఇమాన్ కె నామ్ షహీద్ మహ్మద్ అఫ్జల్ గురు కా ఆఖరీ పైగామ్' టైటిల్ తో విడుదల చేశారు. 94 పేజీలతో ఉన్న ఈ పుస్తకం ఊర్దూ భాషలో ఉంది. రెండు రోజుల కిందట (అంటే మంగళవారం) శ్రీనగర్ లో ఏర్పాటుచేసిన పుస్తక విడుదల కార్యక్రమంలో అఫ్జల్ సోదరుడు అజీజ్ గురు కూడా పాల్గొన్నాడు. అయితే, ఈ కార్యక్రమంలో అఫ్జల్ భార్య, కుమారుడు లేరు. పుస్తకాన్ని విక్రయించబోమని, ప్రింట్ చేసిన ఐదువేల కాపీలను పంచుతున్నట్లు గురు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు, పుస్తకంపై నిషేధం విధించాలంటూ భారతీయ జన యువ మోర్చా డిమాండ్ చేసింది.