: సాగునీటి విడుదల కష్టమే: సీఎంకు తేల్చిచెప్పిన అధికారులు


కృష్ణా పశ్చిమ డెల్టా కింద సాగవుతున్న పంటలకు నీరందించే విషయంలో అధికారులు చేతులెత్తేసినట్టే కనబడుతోంది! సాగర్ ఆయకట్టు కింద ప్రస్తుతం సాగునీటి విడుదల కష్టమేనని నీటి పారుదల శాఖ అధికారులు సీఎం కిరణ్ కుమార్ కు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఈ రోజు నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటిని మొదట తాగునీటి అవసరాలకే కేటాయించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మున్ముందు వేసవి కారణంగా తాగునీటికి మరింత డిమాండ్ ఉంటుందని వారు పేర్కొన్నారు.

కాగా, కృష్ణా డెల్టాకి నీటి విడుదలపై మరోవారంలో నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ మహా ధర్నాకు దిగుతుందని చంద్రబాబు ఇంతకుముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News