: కొందరికి మాత్రమే వ్యాధులు ఎందుకొస్తాయంటే...


మనలో కొందరికి మాత్రమే ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి. మరికొందరికి తక్కువ వ్యాధులు వస్తుంటాయి. ఇలా కేవలం కొందరికి మాత్రమే ఎక్కువ వ్యాధులు రావడానికి కారణం ఏమై ఉంటుంది... అంటే కేవలం వ్యక్తులోని జన్యువైవిధ్యాలు మాత్రమేనట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యేక అధ్యయనం చేసి వ్యక్తుల మధ్య జన్యు వైవిధ్యాల కారణంగా ప్రత్యేకమైన జబ్బులు వస్తుంటాయని చెబుతున్నారు.

జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వ్యక్తుల మధ్య వైరుద్ధ్యాలకు కారణమయ్యే జన్యు మూలాలను వెతికిపట్టడంలో సాయపడే ఒక ప్రత్యేకమైన సమగ్ర జన్యుమాప్‌ను తయారుచేశారు. ఈ మ్యాప్‌ వ్యక్తుల్లో వచ్చే వ్యాధుల నిర్ధారణ, చికిత్సల్లో శక్తిమంతమైన సాధనంగా ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో ఐరోపాలోని తొమ్మిది సంస్థలకు చెందిన యాభై మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించి వారికే ప్రత్యేకమైన జన్యు విశిష్టతలు ఉంటాయి. ఈ విశిష్టతవల్ల వారిలో వ్యాధులకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగాగానీ లేదా తక్కువగాగానీ ఉంటాయి. ఇలా కొందరికే ఎక్కువ లేదా తక్కువ వ్యాధులు రావడానికి కారణాలు ఏమై ఉంటాయా? అని పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు సుమారు 462 మంది వ్యక్తుల నుండి సేకరించిన కణాల్లోని ఆర్‌ఎన్‌ఏ క్రమాన్ని గుర్తించడం ద్వారా ఇలా జన్యువ్యక్తీకరణను కొలిచారు. వ్యక్తుల మధ్య జన్యు వైవిధ్యాల కారణంగానే కొందరు ఎక్కువ వ్యాధులకు, మరికొందరు తక్కువ వ్యాధులకు గురవుతుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News