: గంటా నివాసంలో సీమాంధ్ర మంత్రుల మంతనాలు
మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు సమావేశమయ్యారు. మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజానాథ్, టీజీ వెంకటేశ్, పితాని సత్యనారాయణ, అహ్మదుల్లా, కొండ్రు మురళి, కాసు తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు సమైక్యాంధ్ర ఉద్యమం, ఉద్యోగుల సమ్మె వంటి అంశాలపై చర్చించనున్నారు.