: హైదరాబాదులో భారీ వర్షం
హైదరాబాదులో పలు చోట్ల ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. పాతబస్తీతో పాటు ఎల్బీ నగర్, వనస్థలిపురం, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, నాంపల్లి, అంబర్ పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.