: మోడీపై అద్వానీ ప్రశంసలు
పార్టీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీని ప్రకటించడంతో వెనువెంటనే వ్యతిరేకబావుటా ఎగురవేసి, ఆనక మౌనం వహించిన బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ రాజీ కొచ్చారా? పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై అద్వానీ కినుక వహించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయనే తమ ఎన్నికల దళపతిని ఆకాశానికెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ వ్యవస్థకు ఆద్యుడు మోడీయేనని ప్రశంసించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్యుత్ రంగంలో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లు అభివృద్ధి సాధించాయన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే ఒకే విధమైన అభివృద్ధి ఉంటుందని ఛత్తీస్ గఢ్ లో నిర్వహించిన బహిరంగ సభలో అద్వానీ పేర్కొన్నారు.