: దివాకర్ ట్రావెల్స్ బస్సును అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
సమైక్యాంధ్ర సెగ మంత్రి దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ కూ తగిలింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దివాకర్ రెడ్డి చేస్తున్న 'రాయల తెలంగాణ' ప్రతిపాదనను ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతే కాకుండా సీమాంధ్ర ఉద్యమంలో అందరూ భాగస్వాములైతే మీరు బస్సులు ఎలా తిప్పుతారని నిలదీశారు.
దీనికి తోడు జిల్లాలోని రాయదుర్గంలో సమైక్యానికి మద్ధతుగా వంటావార్పు కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలో ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ సుమంత్ గుండెపోటుతో మృతి చెందారు. ఉద్యమానికి సంబంధించిన వార్తలను టీవీలో చూస్తూ ఆయన ప్రాణాలు విడిచినట్టు అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ తెలిపారు.