: రేపు ఢిల్లీకి సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిళ్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన యూపీఏ చైర్ పర్సన్ సోనియాతో పాటు పార్టీ హైకమాండ్ నేతలను కలవనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆయన వారికి వివరించనున్నారు. తెలంగాణ నోట్ తయారవుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే తెలంగాణకు మోకాలడ్డుతున్న కిరణ్ ఢిల్లీ యాత్రతో మరేం చేస్తాడోనని... తెలంగాణ నేతలు కలవరానికి గురవుతున్నారు.