: నిధుల కోసం సంజయ్ దత్ 'లుంగీ డాన్స్'


నిధులు సమీకరించేందుకు పుణేలోని యెరవాడ జైలు అధికారులు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ నాటకంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తోటి ఖైదీలను అలరించేందుకు షారుక్ ఖాన్ తాజా చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్'లోని 'లుంగీ డాన్స్ లుంగీ డాన్స్.. ' అనే పాటకు సంజూ డాన్స్ చేయనున్నాడట. సంజయ్ తో పాటు ఈ కార్యక్రమంలో 50 మంది పాల్గొంటారు. దాదాపు రెండు గంటల పాటు ఉండే ఈ కార్యక్రమం నగరంలోని ఓ థియేటర్ లో జరగనుంది. దీని ద్వారా వచ్చే నిధులను ఖైదీల ఆరోగ్య ఖర్చులు, సౌకర్యాల కోసం ఉపయోగిస్తారు. ముంబయి పేలుళ్ల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంజయ్ కు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడంతో మూడు నెలల నుంచి యెరవాడ కేంద్ర కారాగారంలో ఉంటున్నాడు.

  • Loading...

More Telugu News