: కోల్ కతాలో 67 మంది చిన్నారులకు అస్వస్థత
కోల్ కతాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. వీరి నిర్లక్ష్యంతో కోల్ కతాలోని ఆరమ్ బాగ్ లో 67 మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. పోలియో చుక్కలకు బదులు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయడంతో వీరి పరిస్థితి విషమించింది. దీంతో వీరిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం 40 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఘటనకు కారణమైన నలుగురు ఆరోగ్య కార్యకర్తలను... అధికారులు విధులనుంచి తొలగించారు.