: అర్ధరాత్రితో ముగిసిన వెబ్ కౌన్సిలింగ్ గడువు
గత అర్ధరాత్రితో ఇంజినీరింగ్, బీ ఫార్మసీ ప్రవేశానికి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ముగిసింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెలువడుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోసం 1,30,289 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరవగా... వీరిలో 1,28,716 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.