: ఆసుపత్రిలో చేరిన దిలీప్ కుమార్


ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఈ రాత్రి 8.30 ప్రాంతంలో ఆసుపత్రిలో చేరారు. 91 సంవత్సరాల దిలీప్ తనకు ఒంట్లో అసౌకర్యంగా వుందని చెప్పడంతో, వెంటనే ఆయనను ముంబయ్ లోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సాధారణ వైద్యపరీక్షలన్నీ జరుగుతున్నాయనీ, దిలీప్ బాగానే ఉన్నారనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ ఆయన మేనేజరు మీడియాకు తెలిపారు. అయితే, దిలీప్ వృద్ధాప్యంతో బాధపడుతుండడంతో వైద్యులు ఇంటెన్సివ్ కేర్ లో వుంచి చికిత్స చేస్తున్నారు.

  • Loading...

More Telugu News