: జేపీ యాత్ర వాయిదాపై రాజమౌళి ఆవేదన


లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చేపట్టిన తెలుగుతేజం బస్సు యాత్ర వాయిదాపడడంపై టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన స్పందిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రజలను ఏకతాటిపై నిలిపేందుకే జేపీ ఈ యాత్ర చేపట్టారని, కానీ, ఆయనపై 'వ్యతిరేకి' అన్న ప్రచారం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు జేపీ ఆ ప్రాంతంలో ఇలాగే పర్యటించారని, ఇప్పుడూ ప్రజల కోసమే ఆయన యాత్ర చేపట్టారని వివరించారు. తనకు ఈ ఉద్యమం గురించి పెద్దగా తెలియదంటూ, ఒకవేళ రాష్ట్రం విడిపోయినా, ప్రజలు మాత్రం పరస్పరం ద్వేషించుకోకుండా, కలిసిమెలసి ఉండాలని రాజమౌళి ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News