: నిప్పులు చెరిగిన వినయ్ కుమార్


కర్ణాటక ఆల్ రౌండర్ వినయ్ కుమార్ విండీస్-ఏతో తొలి వన్డేలో నిప్పులు చెరిగాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్-ఏ విసిరిన 313 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కరీబియన్ జట్టును వినయ్ కొత్తబంతితో అల్లాడించాడు. 4 ఓవర్లు విసిరిన వినయ్ 14 పరుగులిచ్చి విండీస్-ఏ ఓపెనర్లిద్దరినీ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం విండీస్ జట్టు 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News