: మాజీ మంత్రి మృతికి బాబు సంతాపం
టీడీపీ నేత, మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ మృతికి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు మైనార్టీలకు ఉపయోగపడేలా బషీరుద్దీన్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన మరణం బలహీన వర్గాలతో పాటు సేవారంగానికీ తీరని లోటని పేర్కొన్నారు. బషీరుద్దీన్ మంత్రిగానే కాకుండా, సేవా ధార్మిక రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారని బాబు కొనియాడారు.