: సీఎంతో భేటీ అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు
సీమాంధ్ర కేంద్ర మంత్రులు క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరిగిన సీమాంధ్ర నేతల సమావేశ వివరాలను ఆయనకు వివరించారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయకూడదని వారు తీసుకున్న నిర్ణయాన్ని సీఎం స్వాగతించినట్టు సమాచారం. రాజీనామాలు చేస్తే రాష్ట్ర విభజనను నిలువరించలేమన్న సీఎం మనోగతంతో వారు ఏకీభవించినట్టు తెలుస్తోంది. విభజన విషయంలో కేంద్రం దిగిరాకుంటే అప్పుడు మూకుమ్మడి నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నట్టు తెలిసింది.