: గల్ఫ్ బాధితుల సమస్యలపై లోక్ సభలో చర్చ
గల్ఫ్ దేశాల్లో తెలుగువారితో సహా పలు రాష్ట్రాల బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోక్ సభలో పలువురు నేతలు చర్చించారు. బుధవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే సభలో గల్ఫ్ బాధితుల సమస్యలను టీడీపీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు లేవనెత్తారు. గల్ఫ్ బాధితులు ఎన్నిసమస్యలు పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని సభలో ముందుగా ఈ అంశంపై మాట్లాడిన నామా ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఆ దేశంలో తెలుగువారు అనేక కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం ప్రయివేటు ఏజెంట్లను నమ్మితే మోసం చేస్తున్నారన్నారు. ఈ విషయంలో పరిష్కారం చేసేందుకు కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంగా ఎందుకు పని చేయడం లేదని నామా ప్రశ్నించారు.
నాలుగు సంవత్సరాలుగా సభలో దీనిపైనే చెబుతూ వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నామా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే అంశంపై ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని పొన్నం విజ్ఞప్తి చేశారు.