: వచ్చే ఎన్నికల్లో 272 పైగా సీట్లు సాధిస్తాం: రాజ్ నాథ్ సింగ్


వచ్చే ఎన్నికలకు బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించిన అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మంచి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో 272 పైచిలుకు సీట్లను గెలుస్తామని రాజ్ నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేస్తుందని ధృడనిశ్చయంతో ఉన్నామన్నారు. ముంబయిలో ఓ ప్రారంభోత్సవానికి హాజరైన రాజ్ నాథ్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. అధికారం చేపట్టిన వెంటనే ఆర్ధిక విధానాలను పునఃసమీక్షిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News