: పరువు కోసం..!


సమాజంలో అసమానతలు ఓ నిండుప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ దళితుడిని ప్రేమించిందంటూ తమిళనాడులో ఓ యువతిని ఆమె సోదరులే పరువు కోసం హత్య చేశారు. అత్యంత కిరాతకంగా నోట్లో యాసిడ్ పోసి కడతేర్చారు. తిరునల్వేలి జిల్లా సీవలపేరి గ్రామంలో గోమతి అనే యువతి మురుగన్ అనే యువకుడిని ప్రేమించింది. మురుగున్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గోమతి కుటుంబం వారి అనుబంధానికి అడ్డుచెప్పింది. దీంతో, గోమతి తన ప్రియుడి చెంతకు చేరింది. అతని కుటుంబంతోపాటే ఉంటోంది. దీంతో, ఊళ్ళో తమ పరువు పోయిందని భావించిన గోమతి సోదరులు ఆమెను ఇంటికి లాక్కొచ్చారు. అనంతరం నోట్లో యాసిడ్ పోసి, ఇంట్లోనే ఉరేశారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో వారు ఆమె సోదరులిద్దరినీ అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News