: మురికివాడల ప్రజలకోసం గృహ సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని
మురికివాడల్లో బతుకులీడుస్తున్న పేదల కోసం నిర్మించిన గృహ సముదాయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు చండీగఢ్ లో ప్రారంభించారు. ఈ సముదాయాన్ని నగర శివార్లలో రూ. 2,400 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 8,500 కుటుంబాలు నివసించనున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని 10 మందికి ఇంటి తాళాలను అందజేశారు. ఈ గృహ సముదాయాన్ని 'జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ పథకం (JNNURM)' కింద నిర్మించారు.