: కిరణ్ తో కావూరి, పురంధేశ్వరి భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి భేటీ అయ్యారు. అంతకుముందు సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించుకున్న విషయాలను కిరణ్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక సీమాంధ్రలో 40 రోజుల నుంచి కొనసాగుతున్న ఉద్యమం, సమ్మెపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.