: పర్యాటకానికి అంతర్జాతీయస్థాయి వసతులు అవసరం: చిరంజీవి


పర్యాటక రంగ అభివృద్ధికి తగ్గట్టుగా ఆతిథ్య రంగం తమ కార్యాచరణను రూపొందించుకోవాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సూచించారు. హైదరాబాదులో జరిగిన 'దక్షిణ ప్రాంత పర్యాటక మండలి' సమావేశంలో ముఖ్య అతిథిగా చిరంజీవి ప్రసంగించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ స్థాయి వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పర్యాటక రంగం కొత్త హంగులు సంతరించుకునే కోణంలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి సంబంధించిన డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, కర్ణాటక టూరిజం మంత్రి ఆర్.వీ.దేశ్ పాండే పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News