: మాధురీ దీక్షిత్‌కు పితృవియోగం
నిన్నటి అందాల కథానాయిక, ప్రఖ్యాత బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కు పితృవియోగం కలిగింది. ఈ రోజు ఉదయం ఆమె తండ్రి శంకర్ ఆర్. దీక్షిత్ ముంబైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. ఆయన మాధురితోనే ఉండేవారని ఆమె మేనేజర్ తెలిపారు. తండ్రిని కోల్పోయిన మాధురికి శ్రీదేవి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఆయన లోటు తీర్చలేనిది అయినప్పటికీ... ఆయన సంపూర్ణ జీవితాన్ని గడిపారని మాధురి పేర్కొంది. ఈ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.