: తెలంగాణను అడ్డుకోకండి: చుక్కా రామయ్య
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపుల్ల వేయొద్దని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నగరంలో జరిగిన ఏపీఎన్జీవోల సభ తెలంగాణను అడ్డుకునే విధంగా ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏనాడూ మాట్లాడని వారు... ఇప్పుడు సమైక్య ఉద్యమం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.