: నేడు కృష్ణా జిల్లాలోకి బాబు పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర 'వస్తున్నా మీ కోసం' ఈ రోజు గుంటూరు జిల్లాలోంచి కృష్ణా జిల్లాలోకి తిరిగి ప్రవేశిస్తుంది. ఈ నెల 8న బాబు పాదయాత్ర విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దాటుకుని గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
ఆ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు, కొలకనూరు లో స్టేజీ కూలి స్వల్పంగా గాయపడడం వంటి కారణాలతో యాత్ర ఆలస్యం అయింది. తిరిగి ఈ రోజు పెనుమూడి, పులిగడ్డ వంతెన మీదుగా కృష్ణా జిల్లాలోకి అడుగుపెడతారు. నాలుగు నియోజకవర్గాలలో పాదయాత్ర చేసిన అనంతరం ఉభయ గోదావరి జిల్లాలలో నడక సాగిస్తారు.