: అన్యాయం చేయాలని సోనియాకు లేదు: డీఎస్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఢిల్లీలో సమావేశమైన పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ రాష్ట్ర పరిస్ధితుల గురించి అధినేత్రికి వివరించారు. అనంతరం భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన ఆయన.. ఏ ప్రాంతానికీ అన్యాయం చేయాలని సోనియా మనసులో లేదన్నారు. సోనియాకు అన్నీ తెలుసునని చెప్పారు. విభజనపై సీమాంధ్రులకు ఉన్న అనుమానాలు, అపోహలు తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతం ఊహించనంతగా అభివృద్ధి చెందుతుందని, దానిపై దృష్టి పెట్టాలని డీఎస్ సూచించారు. రెండు ప్రాంతాల మధ్య రాగద్వేషాలు వద్దని ఆయన కోరారు.