: డాల్బీ సౌండ్ ఆవిష్కర్త రే డాల్బీ కన్నుమూత
కొన్నాళ్ళ క్రితం వరకు సినిమా థియేటర్లలో తెరవెనుక మాత్రమే స్పీకర్లుండేవి. శబ్దనాణ్యత అంతంతమాత్రంగానే ఉండేది. అయితే, సినిమా ధ్వనులను అత్యంత స్పష్టతతో వినిపించిన ఘనత రే డాల్బీ (80) మహాశయుడిదే. ఈయన ఆవిష్కరణ అయిన డాల్బీ డిజిటల్ సౌండ్ ఇప్పటికీ హాట్ ఫేవరెట్. డాల్బీ లేబరేటరీస్ పేరిట ఇంతటి ఘనతర ఆవిష్కరణను అందించిన రే డాల్బీ మరిలేరు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని తన నివాసంలో ఆయన గురువారం కన్నుమూశారు. గతకొన్నేళ్ళుగా అల్జీమర్స్ తో బాధపడుతున్న ఆయన గత వేసవిలో అక్యూట్ ల్యుకేమియా బారినపడ్డారు.