: పాతబస్తీలో డీజీపీ స్పెషల్ పూజ.. ఎందుకో?


దినేశ్ రెడ్డి ఐపీఎస్.. రాష్ట్రానికి పోలీస్ బాస్ అయినా మూఢనమ్మకాలకు కొదవలేదు! మంత్రతంత్రాలపై అపారమైన నమ్మకం! ఏదో ఒక సందర్భంలో తనకు వ్యతిరేకంగా క్షుద్ర పూజలు నిర్వహించారన్నప్పటి నుంచి ఆయనలో ఇలాంటి విషయాలపై ఆసక్తి పెరిగింది. వ్యక్తిగతంగా పూజలు జరిపించుకోవడం, గ్రహ శాంతులు చేయించడం వంటివి చేస్తుంటారు. తాజాగా, ఈ డీఐజీ హైదరాబాదు పాతబస్తీలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మీడియా కంట్లో పడ్డారు. పోలీసు భద్రత మధ్య హబీబ్ బద్రూస్ అనే వ్యక్తి దినేశ్ రెడ్డితో ఈ పూజలు చేయించినట్టు తెలుస్తోంది.ఈ పూజా కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్న మీడియాను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం డీజీపీ ఆస్తులపై విచారణ జరపాలంటూ సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News