: తదుపరి చిత్రంతో షారూక్ ను అధిగమిస్తా: సల్మాన్ ఖాన్


నటుడు షారూక్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మధ్య వివాదాలు ఉన్నాయని కొన్నాళ్ల నుంచి వస్తున్న వార్తలు అందరికీ తెలిసిందే. రెండు నెలల కిందట ముంబయిలోని ఓ విందులో వీరిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. దీంతో, వీరిమధ్య భేదాభిప్రాయాలు తొలగిపోయాయని, మళ్లీ ఒక్కటయ్యారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఈ ఘటనపై వారు కూడా స్పందించలేదు. 'బిగ్ బాస్-7' సీజన్ కోసం ఈ రోజు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో సల్మాన్.. షారూక్ విషయంపై మాట్లాడాడు. కింగ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం రూ.225 కోట్ల 67 లక్షలతో సల్లూ 'ఏక్ థా టైగర్', అమీర్ ఖాన్ 'త్రి ఇడియట్స్' చిత్రాల పేరుతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డును అధిగమించి కొత్త రికార్డును నమోదు చేసింది. దీనిపై మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రంతో షారూక్ రికార్డును అధిగమిస్తానని చెప్పాడు.

కాగా, వారిద్దరి ఆలింగనంపై మాట్లాడుతూ..'విందు కార్యక్రమంలో షారూక్ ను కౌగిలించుకోవడం అనేది సాదారణంగానే జరిగింది. రంజాన్ నెలలో ప్రతి ఒక్కరూ ఎదుటివారికి తమ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇలా స్పందిస్తారు. ఆ ఘటన కేవలం మానవత్వ దృక్పథంతో చోటు చేసుకుంది. షారూక్ కు, నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. తన తాజా చిత్రం అన్ని రికార్డులను అధిగమించింది. తనతో నాకేమైనా సమస్య ఉంటే నా వర్క్ తో సమాధానం ఇస్తాను. 'బిగ్ బాస్-7' సీజన్ లో షారూక్ చిత్రం ప్రచారానికి రావాలని నేను ఆహ్వానిస్తాను. తనకు ఇష్టం ఉండి రావాలనుకుంటే నాకు ఓకే' అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News