: ఛాతీలో అదేపనిగా నొప్పా.. అయితే గుండె పోటు కావచ్చు!
ఒత్తిళ్ళతో కూడిన జీవనశైలి కారణంగా నేటి కాలంలో గుండె పోటుతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. తీసుకునే ఆహారం, పనితీరు, జన్యుక్రమంలో లోపాలు వంటి అంశాలు ఈ హృద్రోగాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఒబేసిటీ వ్యక్తులు ఎక్కువగా ఉండే అమెరికాలో గుండె పోటుతో మరణాలు అత్యధికం. ప్రతి ఏడాది కోటి మంది వరకు ఛాతీలో నొప్పంటూ ఆసుపత్రులకు వెళుతుంటారట. వారిలో 15-30 శాతం మంది హార్ట్ ఎటాక్ బాధితులే. వారిలో ఛాతీ నొప్పి ఐదు నిమిషాలకంటే ఎక్కువ సేపు ఉందట. ఇక 5 నిమిషాలకంటే తక్కువసేపు ఛాతీ నొప్పితో బాధపడిన వారిలో ఎలాంటి హృద్రోగ ఛాయలు కనిపించలేదని ఓ అధ్యయనంలో తేలింది. నొప్పి నిడివికి, వ్యాధికి సంబంధం కచ్చితంగా ఉంటుందన్న విషయం తమ అధ్యయనం ద్వారా వెల్లడైందని అమెరికాలోని హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్ పరిశోధకులు పేర్కొన్నారు.