: ఎయిడ్స్ కు టీకా


ఇప్పుడైతే కాస్తంత తగ్గుముఖం పట్టిందిగానీ, ఓ రెండు దశబ్దాల క్రితం ఎయిడ్స్ పేరు వింటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి ఉండేది. ఈ మహమ్మారి బారినపడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే, తుళ్ళిపడుతూ లేచిన ప్రభుత్వాలు ఆగమేఘాలపై నష్టనివారణ చర్యలకు ఉపక్రమించాయి. ఊరూవాడా ప్రచారంతో హోరెత్తించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చురకలేస్తుంటే అప్పుడప్పుడు సమీక్షలు చేపడుతూ ఎయిడ్స్ ను రూపుమాపేందుకు తమవంతు శ్రమిస్తున్నాయి.

ఇక ఈ వ్యాధి కారక వైరస్ గురించి తెలుసుకుంటే, మందులకు లొంగదన్న సంగతి తెలిసిందే. ఎయిడ్స్ కు కారణమయ్యే ఈ హెచ్ఐవీ వైరస్ కణ కవచాన్ని బద్దలు కొట్టాలంటే ఇప్పుడున్న మందులకు అసాధ్యం. దీంతో, శాస్త్రవేత్తలు తీవ్ర స్థాయిలో నడుంబిగించారు. అమెరికాలోని ఓరెగాన్ యూనివర్శిటీ పరిశోధకులు ఎట్టకేలకు ఓ టీకాకు రూపకల్పన చేశారు.

ప్రస్తుతం దాన్ని కోతులపై ప్రయోగించారు. కోతుల్లో ఎయిడ్స్ కు కారణమయ్యే సిమియాన్ ఇమ్యూనో డిఫిషియన్సీ (ఎస్ఐవీ)ని ఈ టీకా విజయవంతంగా నిర్మూలించిందట. దాంతో, శాస్త్రవేత్తల్లో ఉత్సాహం ఇనుమడించింది. త్వరలోనే ఈ టీకాను మనుషులపైనా ప్రయోగిస్తామని ఓరెగాన్ వర్శిటీ జీన్ థెరపీ విభాగం అసోసియేట్ డైరెక్టర్ లూయిస్ పికర్ తెలిపారు.

  • Loading...

More Telugu News