: నటి అంజలికి కోర్టు వార్నింగ్


'సీతమ్మ..' ఫేం అంజలిపై చెన్నైలోని సైదాపేట కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళ దర్శకుడు కళంజియమ్ పరువు నష్టం దావా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అంజలిని కోర్టు ఎదుట హాజరుకావాలంటూ పలుమార్లు ఆదేశించినా ఆమె బేఖాతరు చేసింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఈసారి హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News