: ఆ నలుగురిని తొలగించాలని హైకోర్టు చెబితే తలకెక్కలేదా?: వర్ల


ఆర్టీఐ కమిషనర్లుగా తాంతియా కుమారి, వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్, విజయనిర్మల నియామకంపై టీడీపీ విరుచుకుపడింది. ఆర్టీఐ కమిషనర్లుగా రాజకీయ నేపథ్యం ఉన్న వారిని నియమించడం ఏమిటని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఆ నలుగురిని తొలగించాలని హైకోర్టు చెప్పిన విషయం తలకెక్కలేదా? అని సర్కారుపై నిప్పులు చెరిగారు. సమాచార హక్కు చట్టం గురించి సీఎంకు తెలియదని ఎద్దేవా చేశారు. గవర్నర్ కు సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉంది కాబట్టే సర్కారు పంపిన ఆర్టీఐ కమిషనర్ల జాబితాను తిప్పి పంపారని అన్నారు. అయితే, చట్టంతో పనిలేదంటూ అదే జాబితాను మళ్ళీ గవర్నర్ వద్దకు పంపిన ఘనత మన సీఎందని వర్ల వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News