: ఆ నలుగురు ఆర్ టీఐ కమిషనర్ల నియామకంపై పునఃసమీక్షించండి: హైకోర్టు


రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాన్ని పక్కన పెట్టాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. వారి నియామకంపై పునః సమీక్షించాలని, ఆరు వారాల్లో చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ప్రధానంగా తాంతియాకుమారి, వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్, విజయనిర్మలను కమిషనర్లుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు వారి నియామకాలు చెల్లవని పేర్కొంది. మళ్లీ కొత్త నియామకాలు చేపట్టాలని, దానికి సంబంధించిన వివరాలు తమకు తెలపాలని సూచించింది.

  • Loading...

More Telugu News