: కేంద్ర మంత్రి కావూరి ఇంటి ముట్టడికి యత్నం
హైదరాబాదులో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇంటిని ముట్టడించేందుకు ఈ రోజు ఉదయం విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు యత్నించారు. కావూరి వెంటనే తన పదవికి రాజీనామా చేసి... సమైక్యానికి మద్దతు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు విశాలాంధ్ర ప్రతినిధులను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తితో పాటు ఇతర నేతలున్నారు.