: అరుదైన గౌరవం పొందుతున్న పోప్ బెనెడిక్ట్


పోప్ పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకుంటున్న బెనెడిక్ట్ -16 కి, వాటికన్ సిటీలోని చర్చ్ అరుదైన గౌరవాన్ని ఇవ్వనుంది. ఆయనను 'మాజీ పోప్' అని సంబోధించడానికి చర్చ్ ఇష్టపడడం లేదు. అందుకు బదులుగా 'గౌరవనీయ పోప్' (పోప్ ఎమిరిటస్) పేరిట ఆయనను ఇకపై సంబోధిస్తారు.

అంటే, అధికారికంగా పోప్ కానప్పటికీ, అదే స్థాయిలో ఆయన గౌరవం పొందుతారు. పోప్ ధరించే శిలువ ముద్రిత షాల్ (క్యాసక్) ను కూడా బెనెడిక్ట్ ఎప్పటిలానే ధరిస్తారు. 85 ఏళ్ల బెనెడిక్ట్ అనారోగ్య, వయోభారం వల్ల గురువారం నాడు పోప్ పదవి నుంచి తప్పుకుంటున్న సంగతి మనకు తెలిసిందే!          

  • Loading...

More Telugu News