: 17న తెలంగాణ ఆత్మగౌరవ దినోత్సవం: ఎంపీ రాపోలు
తెలంగాణవాదుల ఉదార స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని సీమాంధ్రులు రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తెలిపారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ.. 1972 స్ఫూర్తితో విభజన కోసం ఉద్యమిస్తున్న బలహీనవర్గాలను, దళితులను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 17న తెలంగాణ ఆత్మగౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు.