: తానా మహాసభలు-2013 వెబ్ సైట్ ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు వారి కోసం స్థాపించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)- 2013 మహాసభల కోసం రూపొందించిన వెబ్ సైట్ ను వాషింగ్ టన్ లో ఆవిష్కరించింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ లో ఈ ఏడాది మే 24 నుంచి 26 వరకు ఈ మహాసభలను తానా నిర్వహించనుందని తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వెల్లడించారు.
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక అంశాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తానా తెలిపింది. వివరాలు కావాల్సిన వారు www.tana2013.org వెబ్ సైట్ ను సందర్శించాలని తానా కోరింది.
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక అంశాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తానా తెలిపింది. వివరాలు కావాల్సిన వారు www.tana2013.org వెబ్ సైట్ ను సందర్శించాలని తానా కోరింది.