: రాజకీయ పార్టీలను కలుపుకుపోవాలి: ఎంపీ మాగుంట
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీఎన్జీవోలు రాజకీయ పార్టీలను కలుపుకుని పోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఏపీఎన్జీవోలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎంపీని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలను రెఫరెండంగా తీసుకోవాలని ఆంటోని కమిటీని కోరినట్టు తెలిపారు. అంతేకాకుండా తమపై అనర్హత వేటు వేసేవరకు పోరాడుతామని అన్నారు.