: టాప్ 200 యూనివర్సిటీల్లో ఇండియాకు దక్కని స్థానం


ప్రపంచ టాప్ 200 యూనివర్సిటీల్లో మన దేశానికి చెందిన ఒక్క యూనివర్సిటీ కూడా స్థానం దక్కించుకోలేకపోయింది. పేరుగాంచిన ఐఐటీలు, ఐఐఎంలు కూడా ఇందులో చోటు సంపాదించుకోలేకపోయాయి. యూనివర్సిటీల గొప్పదనాన్ని చాటే 'క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకు'లను లండన్ లో ప్రకటించారు. అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , హార్వర్డ్ యూనివర్సిటీలు ఈ లిస్ట్ లో తొలి రెండు స్థానాలను అధిష్ఠించాయి. బ్రిటన్ కు చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మూడో స్థానాన్ని పొందింది. మనదేశానికి చెందిన ఢిల్లీ ఐఐటీ 222వ స్థానాన్ని పొందింది. పోయినేడాది ఢిల్లీ ఐఐటీ 212వ స్థానంలో ఉండగా... ఈ ఏడాది మరో 10 స్థానాలు దిగజారింది.

  • Loading...

More Telugu News